పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్.. రహస్య ప్రాంతానికి తరలింపు, దేశవ్యాప్తంగా హై అలర్ట్

Former Pakistan PM PTI Chief Imran Khan Arrested From Outside Islamabad High Court Today,Former Pakistan PM Imran Khan,Pakistan PM Imran Khan Arrested,Pakistan PM Imran Khan Arrested Outside Islamabad Court,Mango News,Mango News Telugu,Former Pakistan PM Imran Khan Arrested,Pakistan PM,Ex-Pakistan PM Imran Khan arrested,Former Pakistani PM Imran Khan arrested at Islamabad court,Pakistan PM Arrested Outside Islamabad Court,Pakistan PM Imran Khan Latest News And Updates,Pakistan PM Imran Khan

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్ అయ్యారు. మంగళవారం ఆయనను ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో పాక్ రేంజర్లు అరెస్టు చేశారు. అల్ కాదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేస్తున్న సమయంలో కోర్టులో ఘర్షణ జరిగింది. పాకిస్థాన్ రేంజర్లు దురుసుగా ప్రవర్తించడంతో ఇమ్రాన్‌ గాయపడినట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన లాయర్లు కూడా గాయపడ్డారని పీటీఐ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ అనంతరం ఇమ్రాన్‌ను పాక్ రేంజర్లు రహస్య ప్రాంతానికి తరలించారు.

ఇక ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్‌తో ఇస్లామాబాద్‌తో పాటు పలు నగరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ మద్దతుదారులు పాకిస్థాన్‌లోని అనేక పట్టణాల్లో విధ్వంసానికి దిగారు. దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కాగా గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తనపై కుట్ర చేస్తోందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నేడు అరెస్ట్‌కు ముందు ఇమ్రాన్ వీడియో సందేశంలో మాట్లాడుతూ.. ఎలాగైనా తనను కేసుల్లో ఇరికించాలని, హత్య చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలోనే ఆయనను రేంజర్లు అరెస్ట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − eight =