షాకింగ్ విషయాలు వెళ్లడించిన సర్వే

OCD,OCD induces suicide, The survey revealed, OCD shocking facts,
OCD,OCD induces suicide, The survey revealed, OCD shocking facts,

చాలా మంది తమకు తెలియకుండానే ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్  సమస్యను ఎదుర్కొంటున్నారు.దీని వల్ల ఏ పని చేసినా వారిలో సంతృప్తి ఉండకపోవడంతో చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. అంటే తుడిచిన ఇంటిని మళ్లీ మళ్లీ తుడవడం, కడిగిన వస్తువులను రెండు మూడు సార్లు కడగటం వంటివి చేస్తుంటారు.

ఈ వ్యాధి బారిన పడిన వారు పదేపదే చేతులను కడుగుతూ ఉంటాయి. అయినా మళ్లీ ఏదైనా హ్యండ్ వాష్‌తో శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ రాయడం వంటివి చేస్తుంటారు. అలా ప్రతీ పనిని రెండు, మూడు సార్లు చేస్తూ మెంటల్‌గా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.  ఇలాంటి చిన్న చిన్న పనులను వారు రోజు చేస్తూ.. మెంటల్‌గా ఇబ్బంది పడుతుంటారు.దీనివల్ల టైముకు పనులు కాకపోవడం వల్ల ముఖ్యమైన పనులను కంప్లీట్ చేసుకోకుండా అన్ని పనుల్లో వెనుకబడుతూ ఉంటారు.అయితే తాజాగా దీనిపై సర్వే చేసిన ఓ సంస్థ కొన్ని షాకింగ్ విషయాలను తెలిపింది.

ఓసీడీ ఉన్న వ్యక్తులు మామూలు వ్యక్తుల కంటే ముందుగానే చనిపోవడం లేదా, ఆత్మహత్యలు చేసుకునే అవకాశం 82 శాతం ఎక్కువ ఉన్నట్లు తెలిపింది.జనాభాలో రెండు శాతం మందిని ఈ ఓసీడీ  తీవ్రంగా ప్రభావితం చేస్తుదంట. ఈ వ్యాధితో బాధపడే వ్యక్తులు ఎక్కువగా బాధాకరమైన ఆలోచనలను కలిగి ఉంటారంట. ఏదైనా కలిషితం అవుతుందనే భయంతో చేసిన పనినే మళ్లీ చేస్తూ ఇబ్బందులు పడుతుంటారు. ఇది వారి జీవితంలో గణనీయంగా దెబ్బతీస్తుందని, దీని వల్ల సంబంధాలు, నలుగురితో కలిసి ఉడటం వంటివి చేయకపోవడం వల్ల మనోవేధనకు గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉందంటున్నారు నిపుణులు.

స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి అధ్యయనకర్తలు..  ఓసీడీ ఉన్న 61,378 మందిని పరిశీలించగా.. అందులో 69 నుంచి 78 ఏళ్ల వయసున్నవాళ్లు ఓసీడీ లేనివారి కంటే ముందుగానే చనిపోయినట్లు తేలిందట. ఓసీడీ ఉన్నవారిలో కొంత మంది సహజ మరణాలతోనే చనిపోగా..మరి కొంత మంది యాక్సిడెట్స్ వల్ల చనిపోయారంట. అయితే ఈ ఓసీడీ ఆత్మహత్యలను ఎక్కువగా ప్రేరేపిస్తుందని.. దీనికి కారణం  మెదడులో ఉండే గ్రే మేటర్ అని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

మనిషి మెదడులో ప్రేరణలను కంట్రోల్ చేయడానికి గ్రే మేటర్ పని చేస్తుంది. ఓసీడీ వ్యక్తుల్లో గ్రే మ్యాటర్ తగ్గడం వల్ల  ఈ ప్రేరణ నియంత్రించుకోలేరు.అందుకే ఓసీడీ లేని వారితో పోలిస్తే, ఓసీడీ ఉన్నవారు ఆత్మహత్యలు చేసుకుని  చనిపోయే ప్రమాదం  ఐదు రెట్లు ఎక్కువని అధ్యయన కర్తలు తేల్చారు. అంతేకాదు ఓసీడీ ద్వారా ఊపిరితిత్తుల వ్యాధి రావడానికి 73% రిస్కు ఉంటుందని, అలాగే మెంటల్ కండిషన్ డిజార్డర్ రిస్క్ దాదాపు 58% ఉంటుందని, నాడీ వ్యవస్థ మీద రిస్క్ దాదాపు 23 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. ఓసీడీ ద్వారా డిప్రెషన్, ఫ్రెజర్ పెరగడం వల్ల ఆత్మహత్య ఆలోచనలు వస్తాయని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 6 =