ఏపీ హోంమంత్రి అనితపై వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్

Dy CM Pawan Kalyan Strongly Condemns Demeaning Remarks Against Home Minister Anitha

రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడూ విధానపరంగానే ఉండాలని, వ్యక్తిగత దూషణలకు తావుండకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పౌర సమాజం హర్షించేలా కూటమి నేతలు తమ భాషా శైలిని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైకాపా నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం తీవ్రంగా ఖండించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు మాట్లాడే ప్రతి మాటను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

మహిళల కట్టుబొట్టుపై వ్యాఖ్యలు దిగజారుడుతనానికి పరాకాష్ట

మహిళల వ్యక్తిగత రూపం, కట్టుబొట్టునుTarget చేస్తూ మాట్లాడే స్థాయికి ప్రతిపక్ష పార్టీ నేతలు దిగజారిపోవడం అత్యంత విచారకరమని పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు కేవలం హోం మంత్రి అనితను మాత్రమే కాకుండా, సమాజంలోని సగటు మహిళలందరినీ కించపరచడమేనని అభిప్రాయపడ్డారు.

స్త్రీల గురించి మాట్లాడే సమయంలో ప్రతి ఒక్కరూ సంస్కారంతో, జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ, అవి కేవలం ప్రభుత్వ విధానాలు లేదా ప్లానింగ్‌కు వ్యతిరేకంగా మాత్రమే ఉండాలి తప్ప ఇళ్లలోని మహిళలను లాగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.

కూటమి నేతలకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు

వాచాలత్వంతో మహిళలను అవమానించే నైజం ఉన్న విపక్షాల వ్యాఖ్యలను తిప్పికొట్టేటప్పుడు కూటమి నేతలు ఎంతో సంయమనం పాటించాలని పవన్ కల్యాణ్ సూచించారు. అవతలి వారు దిగజారుడు భాష ఉపయోగించారని చెప్పి, కూటమి నాయకులు కూడా అదే బాటలో నడవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

విపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలలోని అభ్యంతరకరమైన అంశాలను, వారి సంస్కృతిని ప్రజలకే వివరించి చెప్పాలన్నారు. పౌర సమాజం గౌరవించే రీతిలో, అత్యంత బలమైన భాషలోనే సమాధానాలు ఇవ్వాలని కూటమి ప్రజాప్రతినిధులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here