థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో గల ప్రపంచ ప్రసిద్ధ ‘జేమ్స్ బాండ్ ఐలాండ్’ పర్యటన విశేషాలను ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ కార్తీక తన ‘Karthi Kitess’ ఛానల్ ద్వారా పంచుకున్నారు. అలాగే, అక్కడకు వెళ్లాలనుకునే వారి కోసం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్ ప్యాకేజీ వివరాలను కూడా వివరించారు.
ఈ పర్యటనలో భాగంగా సముద్ర గర్భంలోని అద్భుతమైన గుహల (caves) గుండా చిన్న బోట్లలో ప్రయాణించడం మరియు ఏనుగు ఆకారంలో ఉన్న రాళ్లను వీక్షించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది , అనేక హాలీవుడ్ చిత్రాల షూటింగ్ జరుపుకున్న ఈ అందమైన దీవిలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది . ముత్యాల షాపింగ్‌తో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఈ ఐలాండ్ పర్యటన ఎంతో అనువైనదని వ్లాగర్ వివరించారు.





































