పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ను కలిసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

Pan India Star Prabhas Backs Union Minister Kishan Reddy’s Nasha Mukt Bharat Campaign, Unveils Walkathon T-Shirt

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల భారీ పాదయాత్ర జరగనుంది. నవంబర్ 25, 26, 27 తేదీల్లో ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు దాదాపు 29 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది.

యువతను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడటంతో పాటు డ్రగ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రజా ఉద్యమంలో సినీ ప్రముఖులను భాగస్వాములను చేసేందుకు కిషన్‌రెడ్డి స్వయంగా వారిని కలిసి ఆహ్వానిస్తున్నారు.

తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను కలిసి పాదయాత్రకు సంబంధించిన టీషర్టులను ఆవిష్కరించారు. కోట్లాది మంది అభిమానులున్న ప్రభాస్ మద్దతుతో యువతలో మరింత చైతన్యం వస్తుందని కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలకు సమాజంలోని ప్రముఖుల మద్దతు కూడా తోడైతేనే డ్రగ్స్ మహమ్మారిని సమర్థంగా అరికట్టగలమని పేర్కొన్నారు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌లను కూడా కిషన్‌రెడ్డి కలిసి పాదయాత్రకు మద్దతు కోరారు. దర్శకులు సుకుమార్, బోయపాటి శ్రీనుతో పాటు లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ తదితర ప్రముఖులు సైతం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సినీ తారలు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here