కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియాలో అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు జరగాల్సిన టీ20 వరల్డ్ కప్-2020 ను వాయిదా వేస్తున్నట్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జూలై 20, సోమవారం నాడు ప్రకటించింది. ఈరోజు జరిగిన ఐబిసి బోర్డు(ఐసిసి యొక్క వాణిజ్య అనుబంధ సంస్థ) సమావేశంలో టీ20 వరల్డ్ కప్-2021, టీ20 వరల్డ్ కప్-2022, ఐసీసీ వరల్డ్ కప్ -2023 కి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు.
ఐసీసీ ఈవెంట్స్ తదుపరి షెడ్యూల్ వివరాలు:
- టీ20 వరల్డ్ కప్-2021: అక్టోబర్ – నవంబర్ 2021 మధ్యన జరగనుంది, ఫైనల్ 14, నవంబర్ 2021 న జరుగుతుంది.
- టీ20 వరల్డ్ కప్-2022: అక్టోబర్ – నవంబర్ 2022 మధ్యన జరుగనుంది, ఫైనల్ 13, నవంబర్ 2022 న జరుగుతుంది.
- ఐసీసీ వరల్డ్ కప్ -2023: అక్టోబర్ – నవంబర్ 2023 మధ్యన భారత్ లో జరగనుంది, ఫైనల్ 26, నవంబర్ 2023 న జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu