టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ లో ప్రమాదం

Accident to Chandrababu Naidu Convoy, Accident to Chandrababu Naidu Convoy at Choutuppal, Chandrababu Naidu, Chandrababu Naidu about the drone incident, Chandrababu Naidu Convoy, Chandrababu Naidu Convoy Accident, Chandrababu Naidu Convoy Accident News, Choutuppal, TDP Leader Chandrababu Naidu

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ కి వస్తుండగా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద ఆవు ఎదురురావడంతో తప్పించబోయి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినట్టు తెలుస్తుంది. దీంతో కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఆ వాహన శ్రేణిలో తర్వాతి వాహనంలో ఉన్న చంద్రబాబు క్షేమంగా ఉన్నారు. ఘటన అనంతరం వాహనాల సమస్య వలన చంద్రబాబు కొద్దిసేపు వేచి ఉన్నారు. అనంతరం మళ్లీ కాన్వాయ్‌ లో హైదరాబాద్‌కు బయలుదేరినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu