జగన్ కంటే చంద్రబాబే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS sharmila, cm jagan, chandrababu naidu, YS Sharmila arrest,All Political and Latest News Updates,Andhra Ratna Bhavan,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Andhra pradesh,AP CM YS Jagan Mohan Reddy,Mango News Telugu,Mango News
YS sharmila, cm jagan, chandrababu naidu, YS Sharmila arrest

నిరుద్యోగుల తరుపున పోరాటం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు వైఎస్ షర్మిల. తెలంగాణలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగుల తరుపున అప్పటి కేసీఆర్ సర్కార్‌పై పెద్ద యుద్ధమే చేశారు. పోరాటాలు, మాటల తూటాలతో కేసీఆర్ సర్కార్‌కు తూట్లు పొడిచారు. ఇప్పుడు ఏపీలో ఉన్నప్పటికీ.. అక్కడ కూడా షర్మిల నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నారు. తన సొంత అన్న జగన్‌పై యుద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మెగా డీఎస్సీ ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నిరుద్యోగులతో కలిసి షర్మిల ర్యాలీ నిర్వహించారు. అయితే పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో.. షర్మిలను అరెస్ట్ చేశారు. ఈక్రమంలో షర్మిల మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతి పెద్ద సమస్యల్లో ఒకటైన నిరుద్యోగానికి జగన్ ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపించకుండా.. నిరుద్యోగుల జీవితాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో 21 వేళ మంది ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

చాలా మంది యువకులు చదువుకున్న చదవులకు సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మెగా డీఎస్సీ భర్తీ విషయంలో చంద్రబాబును జగన్ విమర్శించారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జగన్ మెగా డీఎస్సీ ఇవ్వకుండా దగా డీఎస్సీ ఇచ్చారని మండిపడ్డారు. గతంలో 23 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. గతంలో చంద్రబాబు 7 వేల ఉద్యోగాలు ఇస్తుంటే ప్రశ్నించిన జగన్.. ఇప్పుడు కేవలం 6 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని నిలదీశారు.

ఈ లెక్కన చూసుకుంటే జగన్ కంటే చంద్రబాబు నాయుడే మేలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని.. ఆయనకంటే తాము ఘోరమని వైసీపీ ప్రభుత్వం నిరూపించుకుందని విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడే అధిక ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం జగన్‌పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + ten =