అక్టోబర్ 16 న ప్రారంభం కానున్న కనకదుర్గ ఫ్లైఓవర్

Kanaka Durga flyover, Kanaka Durga flyover opening, Kanaka Durga Flyover will be Inaugurated, Vijayawada Kanaka Durga Flyover, vijayawada kanaka durga flyover bridge, Vijayawada Kanaka Durga flyover inauguration, Vijayawada Kanaka Durga Flyover Opening, vijayawada kanaka durga flyover opening date

విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ను అక్టోబర్ 16 న ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవ‌ర్ ప్రారంభోత్స‌వ‌ కార్య‌క్ర‌మాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ‌మోహ‌న్ ‌రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సంయుక్తంగా నిర్వ‌హించనున్నారని ఏపీ రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. సీఎం వైఎస్ జగన్, కేంద్రమంత్రి గడ్కరీ వర్చువల్ విధానంలో ప్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. రూ.502 కోట్ల వ్యయంతో అబ్బురపరిచేలా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కోసం విజయవాడ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం రెండు సార్లు వాయిదా పడింది. ముందుగా సెప్టెంబర్ 4 న, ఆతర్వాత సెప్టెంబర్ 18 న ఈ ఫ్లైఓవర్ ప్రారంభించాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu