ఏపీకి నలుగురు, తెలంగాణకు ఐదుగురు కొత్త ఐపీఎస్‌ అధికారులు కేటాయింపు

Central Govt Allocates 5 New IPS Officers to Telangana 4 to Andhra Pradesh, Central Govt Allocates 4 New IPS Officers to Andhra Pradesh, Central Govt Allocates 5 New IPS Officers to Telangana, 5 New IPS Officers to Telangana, 4 New IPS Officers to Andhra Pradesh, New IPS Officers to Telangana, New IPS Officers to Andhra Pradesh, New IPS Officers, IPS Officers, Central Govt, Telangana, Andhra Pradesh, Indian Police Service Officers, IPS Officers News, IPS Officers Latest News, IPS Officers Latest Updates, IPS Officers Live Updates, Mango News, Mango News Telugu,

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నలుగురు కొత్త ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ (కేడర్) రూల్స్-1954లోని రూల్-5లోని సబ్-రూల్ (1) ద్వారా అందించబడిన అధికారాలను అమలు చేయడంలో భాగంగా, సివిల్ సర్వీసెస్-2020 పరీక్ష ఫలితాలు ఆధారంగా ఇండియన్ పోలీస్ సర్వీస్‌ (ఐపీఎస్) కు కేటాయించిన 200 మందికి కేంద్ర ప్రభుత్వం క్యాడర్‌ లను కేటాయించింది. అందులో భాగంగా ఐదుగురుకు తెలంగాణ క్యాడర్, నలుగురికి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కేటాయించబడింది.

తెలంగాణ క్యాడర్ కేటాయించబడిన ఐదుగురు ఐపీఎస్‌ అధికారులు:

  1. అవినాశ్‌కుమార్‌ (సొంత రాష్ట్రం – బీహార్)
  2. కాజల్ (ఉత్తర్ ప్రదేశ్)
  3. కంకణాల రాహూల్‌రెడ్డి (తెలంగాణ)
  4. సురుకొంటి శేషాద్రిణిరెడ్డి (తెలంగాణ)
  5. శివం ఉపాధ్యాయ (అస్సాం)

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కేటాయించబడిన నలుగురు ఐపీఎస్‌ అధికారులు:

  1. చల్లపల్లె యశ్వంత్ కుమార్ రెడ్డి (సొంత రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్)
  2. దీక్ష (ఢిల్లీ)
  3. నవజ్యోతి మిశ్రా (బీహార్)
  4. సురణ అంకిత మహావీర్ (మహారాష్ట్ర)

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + four =