తెలంగాణలో ఒకేరోజులో 2242 కరోనా కేసులు, 4693 రికవరీలు నమోదు

Telangana Covid-19 Positive Cases Update on May 23, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 2242 కేసులు నమోదవడంతో మే 23, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,53,277 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 19 మంది మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3125 కి పెరిగింది.

ఇక గత 24 గంటల్లో 4693 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 5,09,663 కు చేరుకుంది. ప్రస్తుతం 40,489 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాడు 42,526 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 1,45,07,897 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 3,89,787 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ