తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. ఎపిసోడ్స్ వారీగా వివరించే ఈ పాఠాలు సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పరుచూరి గోపాల కృష్ణ గారు వివరించిన నాలుగో పాఠం పార్ట్-A లో ఫిదా చిత్రం యొక్క కథా బీజం గురించి, ఒక సామాజిక అంశాన్ని ఎంచుకుని, దాని చుట్టూ కధాంశం అల్లుకున్న తీరును వివరించారు. అదే విధంగా నాలుగో పాఠం పార్ట్-B, పార్ట్-C లలో అర్జున్ రెడ్డి చిత్రానికి కథా మూలం ఏంటి? దాంతో దేవదాసు చిత్రానికి సంబంధమేంటి? దర్శకుడు ఆలోచించిన విధానం, ప్రేక్షకులకు అంతగా నచ్చడానికి గల కారణాలు వంటి అంశాలను విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]