ఆర్టీసీ సమ్మెపై విచారణ నవంబర్ 11కి వాయిదా

High Court Postpones Inquiry Over TSRTC, High Court Postpones Inquiry Over TSRTC Strike, High Court Postpones Inquiry Over TSRTC Strike To November 11, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSRTC Strike Latest News, TSRTC Strike News, TSRTC Strike Updates

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో నవంబర్ 7, గురువారం నాడు కీలక విచారణ జరిగింది. జరుగుతున్న సమ్మె, ఆర్టీసీ వివరాలపై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను నవంబర్ 11వ తేదికి వాయిదా వేసింది. ఈ రోజు విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సమర్పించిన అఫిడవిట్ లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన రెండు నివేదికలూ ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయని, ఉద్దేశ పూర్వకంగా ఇలా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్న సంగతి తెలుసా అని కోర్టు ప్రశ్నించింది. ఈ విధంగా తప్పుడు వివరాలు ఇచ్చిన అధికారులను తన సర్వీసులో చూడలేదని ప్రధాన న్యాయమూర్తి ఆర్ ఎస్ చౌహన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా వివరణ ఇస్తూ సమయాభావం వలన ఇలా జరిగిందని కోర్టును మన్నించాల్సిందిగా కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, క్షమాపణలు కోరడం సమాధానం అవదని, వాస్తవాలు చెప్పాలని కోరుతూ సమర్పించిన నివేదికలలోని లెక్కలపై అసహనం వ్యక్తం చేసింది.

మరో వైపు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వరరావు తన వాదనలు వినిపించారు. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉందని తెలిపారు. విభజన పూర్తీ కాకపోవడంతో టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదని, ఏపీఎస్‌ఆర్టీసీలో కేంద్రానికి ఉన్న వాటా టీఎస్‌ఆర్టీసీకి బదిలీ కాదని స్పష్టం చేసారు. మరోవైపు ఆర్టీసీ రీఆర్గనైజేషన్‌కు తమ అనుమతి కోరలేదని కేంద్రం తెలిపింది. దీనిపై సీఎస్ స్పందిస్తూ, ఆర్టీసీ షెడ్యూల్ 9 కిందకు వస్తుందని హైకోర్టుకు తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్‌3 ప్రకారం టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసినట్లు ఏజీ, ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ కోర్టుకు వెల్లడించారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉందని ఏజీ తెలిపారు. అదేవిధంగా విభజనకు సమయం పట్టేలా ఉండడంతో, ప్రజలకు అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేశామని రామకృష్ణారావు తెలిపారు. పలు అంశాలపై విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 11వ తేదికి వాయిదా వేసింది.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here