కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: రైల్వే ఉద్యోగులకు బోనస్, 7 పీఎం మిత్ర పార్క్‌ల ఏర్పాటు

Cabinet approves bonus for 11.5 lakh railway employees, Cabinet approves Productivity Linked Bonus to railway, festival bonus for Railway employees, Indian Railways 11 Lakh Employees to Get Bonus, Mango News, Productivity Linked Bonus to Railway Employees, Productivity Linked Bonus to Railway Employees for Financial Year 2020-21, Union Cabinet, Union Cabinet approves festival bonus for Railway employees, Union Cabinet approves Productivity Linked Bonus for non-gazetted Railway employees, Union Cabinet Approves Productivity Linked Bonus to Railway Employees for Financial Year 2020-21

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు మరియు జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:

  • రైల్వే ఉద్యోగుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. అర్హత కలిగిన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు అందరికీ (ఆర్పిఎఫ్/ఆర్పిఎస్ఎఫ్ సిబ్బంది మినహా) 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 78 రోజుల వేతనంతో సమానమైనటువంటి ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్‌బీ) ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 78 రోజుల పీఎల్‌బీ చెల్లింపుకై ప్రభుత్వంపై రూ.1984.73 కోట్లు ఆర్థిక భారం పడనున్నట్టు అంచనా వేయగా, ఈ నిర్ణయంతో సుమారుగా 11.56 లక్షల మంది నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు లబ్ధి చేకూరనుంది. ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 బోనస్‌గా అందనున్నట్టు తెలిపారు.
  • రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో 4,445 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ మరియు అపెరల్ (పీఎం మిత్ర) పార్క్‌ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి పార్కు ద్వారా ప్రత్యక్షంగా సుమారు ఒక లక్ష మందికి, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు చెప్పారు. తమిళనాడు, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, అస్సాం, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ తో సహా అనేక రాష్ట్రాలు ఆసక్తి వ్యక్తం చేశాయని, వివిధ ప్రమాణాల ఆధారంగా ఛాలెంజ్ పద్ధతి ద్వారా పీఎం మిత్ర సైట్స్ ఎంపిక చేయనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ