తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 27 శాఖలకు సంబంధించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలివిడతలో భాగంగా 30,453 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు మంజూరు చేసింది. శాఖలవారీగా ఈ ఉద్యోగ నియామకాలను ఏ సంస్థలు/బోర్డులు భర్తీ చేయనున్నాయో స్పష్టం చేస్తూ, అందుకు సంబంధించిన అనుమతులను మంజూరు చేస్తూ బుధవారం నాడు ఆర్థికశాఖ పలు జీవోలు జారీ చేసింది. అదేవిధంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్థికశాఖ విడుదల చేసింది. త్వరలోనే గ్రూప్-1, హోంశాఖ, జైళ్ల శాఖ, ట్రాన్స్ పోర్ట్ శాఖల్లోని 30,453 పోస్టులకు నోటిఫికేషన్స్ వెలువడనున్నాయి.
శాఖల వారీగా అనుమతి లభించిన పోస్టుల వివరాలివే:
- గ్రూప్-1 – 503 పోస్టులు – తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)
- పోలీస్ (డీజీపీ అండ్ ఎస్డీఎఫ్) – 16,587 పోస్టులు – తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)
- పోలీస్ (డీజీపీ అండ్ ఎస్డీఎఫ్) – 231 పోస్టులు – టీఎస్పీఎస్సీ
- జైళ్ల శాఖ – 154 పోస్టులు – టీఎస్ఎల్పీఆర్బీ
- జైళ్ల శాఖ – 31 పోస్టులు – టీఎస్పీఎస్సీ
- ట్రాన్స్ పోర్ట్ శాఖ – 63 పోస్టులు – టీఎస్ఎల్పీఆర్బీ
- ట్రాన్స్ పోర్ట్ శాఖ – 149 పోస్టులు – టీఎస్పీఎస్సీ
- వైద్య, ఆరోగ్యశాఖ – 10,028 పోస్టులు – మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ)
- వైద్య, ఆరోగ్యశాఖ – 2,662 పోస్టులు – టీఎస్పీఎస్సీ
- వైద్య, ఆరోగ్యశాఖ – 45 పోస్టులు – డీఎస్సీ
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ