తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహణ

Telangana Inter Board Releases Timetable for Intermediate Public Exams-2023,Telangana Inter Exam Schedule Released, Inter Exam From Mar 15 To Apr 4,Telangana Inter Examinations,Mango News,Mango News Telugu,Telangana Inter Exams Cancel,Telangana Inter Exam,Telangana Inter Exams Results,Telangana Inter Exams 2022,Inter Exams In Telangana 2022,Inter 1St Year Exams In Telangana 2022,Inter 2Nd Year Exams In Telangana 2022,Inter Exams In Telangana 2023,Ts Inter 1St Year Exam Time Table 2022,Inter 1St Year 2022 Exam Date,Ts Intermediate Board,Ts Intermediate Time Table,Ts Inter Time Table 2023

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు-2023 షెడ్యూల్‌ ను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సోమవారం విడుదల చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అలాగే జనరల్, ఒకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మార్చి 4వ తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు) మరియు మార్చి 6న పర్యావరణ విద్య పరీక్ష (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు) నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • మార్చి 15: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1
  • మార్చి 17: ఇంగ్లీష్ పేపర్-1
  • మార్చి 20: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, పొలిటికల్ సైన్స్ పేపర్- 1
  • మార్చి 23: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
  • మార్చి 25: ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
  • మార్చి 28: కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1
  • మార్చి 31: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు)
  • ఏప్రిల్ 3: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1 మరియు జాగ్రఫీ పేపర్ -1.

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • మార్చి 16: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 2
  • మార్చి 18: ఇంగ్లీష్ పేపర్ -2
  • మార్చి 21: మ్యాథమేటిక్స్ పేపర్- 2A, బోటనీ పేపర్- 2, పొలిటికల్ సైన్స్ పేపర్- 2
  • మార్చి 24: మ్యాథమెటిక్స్ పేపర్- 2B, జువాలజీ పేపర్- 2, హిస్టరీ పేపర్- 2
  • మార్చి 27: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
  • మార్చి 29: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2
  • ఏప్రిల్ 1: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
  • ఏప్రిల్ 4: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 12 =