తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:
- చేనేత, జౌళి అండ్ హస్తకళలు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్ నియామకం
- రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల కమిషనర్గా రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలు
- విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియామకం
- డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా వైద్యశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీకి అదనపుబాధ్యతలు
- జీడీఏ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి వీ.శేషాద్రికి అదనపు బాధ్యతలు
- యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF