ఈనెల 5న ఢిల్లీకి వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత.. బీబీసీ అవార్డుల కార్యక్రమానికి హాజరు

MLC Kavitha To Attend BBC Indian Sportswoman Of The Year Awards In Delhi On March 5Th,MLC Kavitha To Attend BBC,Indian Sportswoman Of The Year Awards In Delhi,Voting Begins For The BBC Indian Sportswoman,BBC Indian Sportswoman Of The Year,Mango News,Mango News Telugu,MLC Kavitha,BBC Sportswoman Of The Year 2023,Indian Sportswoman Of The Year 2023,BBC Indian Sportswoman Of The Year Award 2023,MLC Kavitha Latest News And Updates,MLC Kavitha Live News,Kalavakuntla Kavitha News

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఎంపీలు జయంత్ చౌదరీ, సంజయ్ సింగ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్, మాజీ ఎంపీ దిలీప్ టిర్కే తదితరులు హాజరవనున్నారు. కాగా ఈ అవార్డులకు ఒలింపిక్ రజత పతక విజేతలు పీవీ సింధు, మీరాబాయి చానుతో పాటు మరో ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత రెజ్లర్ వినేష్ ఫోగట్ మరియు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌లు ఆన్‌లైన్ పబ్లిక్ ఓటింగ్‌ ద్వారా నామినీలుగా ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ జర్నలిస్టులు మరియు క్రీడా రచయితలతో కూడిన స్వతంత్ర జ్యూరీకి వచ్చిన ఓట్ల ఆధారంగా ఈ నామినీలు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి.

మార్చి 5న ఢిల్లీలో జరిగే అవార్డ్స్ నైట్‌లో విజేతను ప్రకటించనున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం అందింది. కాగా బీబీసీ న్యూస్, హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం మరియు తెలుగు భాషలకు సంబంధించిన ఏదైనా ఒక బీబీసీ వెబ్‌సైట్‌లో లాగిన్ కావడం ద్వారా ఫిబ్రవరి 20 అర్ధరాత్రి వరకు తమకు ఇష్టమైన నామినీకి ఓటు వేసే అవకాశం కల్పించింది. ఇక ఇప్పటివరకు పీవీ సింధు (2020), కోనేరు హంపీ (2021), మీరాబాయి చాను (2022) ఈ అవార్డును అందుకున్నారు. అలాగే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును పీటీ ఉష (2020), అంజు బాబీ జార్జ్ (2021), కర్ణం మల్లీశ్వరి (2022) పొందారు. ఈ క్రమంలో పీవీ సింధు, మీరాబాయి చానులు రెండోసారి ఈ అవార్డుకు నామినేట్ చేయబడటం విశేషం. ఇక ఈ ఏడాది నుంచి ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’తో పాటు, ‘ఇండియన్ పారా-స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ అనే కొత్త కేటగిరీలు కూడా జోడించబడ్డాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 18 =