యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ‘పిల్లలపై గాడ్జెట్స్ ప్రభావం- పరిష్కార మార్గాలు’ గురించి వివరించారు. ప్రస్తుత రోజుల్లో చాల తక్కువ వయసులోనే పిల్లలు సెల్ ఫోన్స్, ట్యాబ్స్, లాప్ ట్యాబ్ లకు అలవాటు పడిపోతున్నారని, దీంతో సహజమైన అలవాట్లకు, ఆటలకు వారు దూరమవుతున్నారని చెప్పారు. గాడ్జెట్స్ వలన పిల్లలు ఎక్కువుగా ప్రభావితమవుతున్నారని, అలాగే పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువగా సమయం గడపకపోవడం కూడా పిల్లల కొత్త అలవాట్లకు కారణమని చెప్పారు. పిల్లలు గాడ్జెట్స్ పట్ల విపరీతమైన ఆకర్షణకు గురికాకుండా ఉండాలంటే ఏంచేయాలి? ఆకర్షితులైన వారి అలవాట్లను ఎలా మార్చాలనే అంశాలను ఈ ఎపిసోడ్లో విశ్లేషించారు.
పిల్లలపై గాడ్జెట్స్ ప్రభావం – పరిష్కార మార్గాలు గురించి తెలుసుకోవాలంటే వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]



















































