భూమికి దగ్గరగా రాబోతున్న తోకచుక్క.. మళ్లీ 2455లోనే దర్శనం

The comet that is coming close to the earth will be seen again in 2455,The comet that is coming close,comet close to the earth,will be seen again in 2455,comet will be seen again in 2455,Mango News,Mango News Telugu,Comet, Nishimura appear in India, comet close to the earth, comet again in 2455,The comet Latest News,The comet Latest Updates,comet close to the earth News Today,comet close to the earth Latest News

మరికొద్ది రోజుల్లో భూమికి దగ్గరగా ఒక తోకచుక్క రాబోతున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రతీ 400 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ తోకచుక్క భూమికి దగ్గరగా వస్తుందని చెప్పారు. నిషిమురా అనే తోకచుక్క ఈ ఏడాది కనిపిస్తే.. ఇక మళ్లీ 2455లోనే దర్శనమిస్తుందని తెలిపారు.

చివరిసారిగా ఈ నిషిమురా తోకచుక్క జులై 1588లో కనిపించింది. ఈ తోకచుక్క 432 ఏళ్ల కక్ష్య కాలాన్ని కలిగి ఉంటుంది. ఇది సుదూరంగా ఉండే ఊర్ట్ క్లౌడ్ నుంచి ఉద్భవించింది. సౌర కుటుంబంలో ఉండే అన్ని గ్రహాల తర్వాత గల ప్రాంతాన్ని ఉర్ట్ క్లౌడ్ అంటారు.

నిషిమురా తోకచుక్క భూమికి సుమారుగా 126 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. జపనీస్ ఖగోళ ఔత్సాహికుడు హిడియో నిషిమురా దీన్ని కనుగొనడంతో.. దీనికి నిషిమురా అనే పేరు వచ్చింది. దీనిని C/2023 P1 అని కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఈ తోకచుక్క ఇన్నర్ సోలార్ సిస్టమ్ నుంచి వెళ్తోంది. సూర్యుడి చుట్టూ తిరుగుతూ, భూమికి దగ్గరగా వస్తోంది.

సెప్టెంబర్ 12న నిషిమురు తోకచుక్క భూమికి 126 మిలియన్ల దూరంలోనే ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడి కాంతికి 15 డిగ్రీల కోణంలో ఇది కనిపించింది. అయితే రాబోయే కొద్ది రోజుల్లోనే ఇది సూర్యుడికి మరింత దగ్గర వస్తూ.. దాని పెరిహెలియన్ అంటే సూర్యుడికి దగ్గరగా ఉండే స్థానం ఉండే పాయింటుకు చేరుకుంటుంది. కానీ ఇది సూర్యుడికి దగ్గర ఉండటం వల్ల ఈ తోకచుక్క రాత్రి సమయంలో కనిపించదు. నెమ్మదిగా సూర్యుడి నుంచి దూరం జరిగే కొద్దీ.. అంటే సెప్టెంబర్ మూడవ వారం నుంచి రాత్రి సమయంలో మళ్లీ కనిపిస్తుంది.

ఇక ఇండియాలో ఈ తోకచుక్క సూర్యోదయానికి ముందు 30-40 నిమిషాల మధ్య కలిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లియో నక్షత్రరాశిలో తూర్పు, ఆగ్నేయదిశలో ఈ నిషిమురా తోకచుక్క కనిపిస్తుంది. కానీ ఈ తోకచుక్కను పోల్చుకోవడం కష్టంగా మారొచ్చేమోనని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పొలారిస్ నక్షత్రం అంటే నార్త్ స్టార్ ప్రకాశం వల్ల ఈ తోకచుక్క సరిగ్గా కనిపించే అవకాశం తక్కువగా ఉంటుంది. పవర్ ఫుల్ బైనాక్యులర్, బయోస్కోప్ వంటి వాటిని ఉపయోగించి ఈ తోకచుక్కను చూడొచ్చని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =