అమెరికా ‘ఆటా’ సభల వేదికగా మంత్రి ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR Extends Wishes Minister Errabelli Dayakar Rao on His Birthday, Telangana CM KCR Extends Wishes Minister Errabelli Dayakar Rao on His Birthday, KCR Extends Wishes Minister Errabelli Dayakar Rao on His Birthday, Minister Errabelli Dayakar Rao Birthday, Minister Errabelli Dayakar Rao Birthday Wishes, Minister Errabelli Dayakar Rao Birthday Greetings, Telangana Panchayat Raj Minister Errabelli Dayakar Rao, Panchayat Raj Minister Errabelli Dayakar Rao, Minister Errabelli Dayakar Rao, Errabelli Dayakar Rao, Panchayat Raj Minister, Dayakar Rao, CM KCR, KCR, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు సోమవారం అమెరికాలో ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభలకు ఆహ్వానం అందుకున్న మంత్రి దయాకర్ రావు అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో నేడు ముఖ్య అతిథిగా వెళ్లిన ఆయన తన 64వ పుట్టిన రోజు వేడుకలను నేడు అందరి సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ‘ఆటా’ ప్రతినిధులు మంత్రి చేత వేదిక మీద కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వేడుకలకు తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, గాదరి కిషోర్ కుమార్‌, తదితరులు కూడా హాజరయ్యారు. కాగా అమెరికాలో ఉన్న మంత్రి ఎర్రబెల్లికి గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా మంత్రికి ఫోన్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. ఇంకా సహచర మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు కూడా మంత్రికి విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి.. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళి సై, సీఎం కేసిఆర్, కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ