కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడికి రాహుల్ గాంధీ కీలక సూచన

Rahul Gandhi's Advice For The Next Congress President Should Remember It is an Ideological Post, Rahul Gandhi , Aicc President, TPCC's Key Decision, TPCC Resolution on Aicc President, Aicc President Rahul Gandhi, Rahul Gandhi Aicc President, Mango News, Mango News Telugu, TPCC Congress President, TPCC Decision on Aicc President, All India Congress Committee , Indian National Congress, Sonia Gandhi, Next Congress President, Rahul Gandhi President

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పార్టీకి కాబోయే అధ్యక్షుడికి కీలక సూచన చేశారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా ఈ సలహాను గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. గురువారం దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ కాంగ్రెస్‌కు తదుపరి అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా.. పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం అనేది హోదా కాదని, అది ఒక సైద్ధాంతిక పదవి అనేది గుర్తుంచుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. ఇక రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన దేశవ్యాప్త `భారత్ జోడో యాత్ర` 15వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం కేరళలో ఈ యాత్ర సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేరళ చేరుకున్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాల మధ్య ఆయన రాహుల్ గాంధీని కలవనున్నారు.

పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా వచ్చేవారు, మీరు భారతదేశం యొక్క నిర్దిష్ట దృక్పథాన్ని నిర్వచించే ఒక చారిత్రాత్మక స్థానం తీసుకుంటున్నారు. అలాగే మీరు ఆలోచనల సమితి, విశ్వాస వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించనున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చింతన్ శివిర్‌లో తీసుకున్న ‘ఒక్క వ్యక్తి, ఒకే పదవి’ వంటి నిర్ణయానికి పార్టీలో ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. ఉదయ్‌పూర్‌లో మేము ఏ నిర్ణయం తీసుకున్నామో, ఆ నిబద్ధతను కొనసాగించాలని మేము ఆశిస్తున్నామని రాహుల్ గాంధీ ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =