మునుగోడులో గుర్తు మార్పుపై ఆర్వోపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం

Munugode By-poll CEC Serious on Returning Officer Over Changing The Road Roller Symbol for Candidate, Munugode By-poll CEC Serious on Returning Officer, CEC Serious on Returning Officer, Road Roller Symbol for Candidate, Mango News, Mango News Telugu, Telangana Chief Bandi Sanjay Kumar, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

మునుగోడు ఉపఎన్నికల వేళ అభ్యర్థులకు కేటాయిస్తున్న గుర్తుల విషయం వివాదాస్పదమవుతోంది. ఒకవైపు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కారును పోలిన గుర్తులపై ఈసీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాజాగా ఒక అభ్యర్ధికి ముందుగా కేటాయించిన గుర్తుని తర్వాత మార్చారు. ఈ నేపథ్యంలో మునుగోడులో అభ్యర్ధి గుర్తును మార్చడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తప్పుపట్టింది. దీనికి బాధ్యులైన రిటర్నింగ్ అధికారి (ఆర్వో)పై సీరియస్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలిచిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ కు తొలుత కేటాయించిన రోడ్ రోలర్ గుర్తుని ఆ తర్వాత ఆర్వో మార్చారు. దీనిపై శివకుమార్ సీఈసీకి ఫిర్యాదు చేశారు.

దీంతో స్పందించిన సీఈసీ అభ్యర్ధికి ఒకసారి కేటాయించిన గుర్తును మార్చడాన్ని తీవ్రంగా పరిగణించింది. మునుగోడు ఆర్వో ఎందుకు రోడ్ రోలర్ గుర్తుని మార్చాల్సి వచ్చిందో వివరణ తీసుకోవాలని, ఈ సాయంత్రంలోగా నివేదికను పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. అలాగే శివకుమార్ కు తిరిగి రోడ్ రోలర్ గుర్తుని కేటాయించాలని, దీంతోపాటు మునుగోడు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల జాబితాను సవరించాలని కూడా స్పష్టం చేసింది. ఇక సీఈసీ ఆదేశాలపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల అధికారులు శివకుమార్ కు తిరిగి రోడ్ రోలర్ గుర్తుని కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY