తెలంగాణలో పల్లె దవాఖానాల కోసం ప్రత్యేకంగా 1492 మంది వైద్యుల నియామకం, ఆర్థిక శాఖ అనుమతి

Telangana Finance Department Accord Permission for Recruitment of 1492 Doctors exclusively for Palle Dawakhanas,Telangana Finance Department,Recruitment of 1492 Doctors,Palle Dawakhanas,Telangana Palle Dawakhanas,Palle Dawakhanas Latest News and Updates,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana CM KCR

ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించడం కోసం ప్రభుత్వం 3వేలకు పైగా సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సబ్ సెంటర్స్/పల్లె దవాఖానాల్లో ఏఎన్ఎంలు, ఆశాలు ప్రజలకు సేవలు అందిస్తుండగా, తాజాగా వైద్యులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పల్లె దవాఖానాల్లో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ డిసెంబర్ 6న జీవో నెంబర్ 1563 జారీ చేసింది. దీంతో 1492 మంది వైద్యుల నియామకం కోసం రాష్ట్ర ఆరోగ్యశాఖ వెంటనే చర్యలు ప్రారంభించనుంది.

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, పల్లె దవాఖానాల కోసం ప్రత్యేకంగా 1492 మంది వైద్యుల నియామకం చేపడుతున్నాం. వైద్యుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వైద్యుల నియామకంతో పల్లెల్లో ఆరోగ్య సేవలు పెరగనున్నాయి. ఆరోగ్య తెలంగాణ దిశగా వడి వడిగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 19 =