తెలంగాణలోని లా కళాశాలల్లో 2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎల్ఎల్బీ (3 సంవత్సరాల కోర్సు)/ఎల్ఎల్బీ 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు) ప్రవేశాల కోసం లాసెట్-2022, 2 సంవత్సరాల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఎల్ సెట్-2022ను జూలై 20, 21 తేదీల్లో నిర్వహించి, ఆగస్టులో ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీఎస్ లాసెట్-2022, టీఎస్ పీజీఎల్ సెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఖరారైంది. నవంబర్ 2వ తేదీ నుంచి కౌన్సెలింగ్ పక్రియ ప్రారంభం కానున్నట్టు టీఎస్ లాసెట్/పీజీఎల్ సెట్ కన్వీనర్ తెలిపారు.
టీఎస్ లాసెట్-2022/టీఎస్ పీజీఎల్ సెట్-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ : నవంబర్ 1
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు వెరిఫికేషన్, ఆన్లైన్ ఫీజు చెల్లింపు, ధృవీకరణ కోసం స్కాన్ చేసిన సర్టిఫికెట్ల కాపీలను అప్లోడ్ చేయడం: నవంబర్ 2 నుంచి నవంబర్ 12 వరకు
- స్లాట్ బుకింగ్ ద్వారా ఎన్సీసీ/క్యాప్/దివ్యాంగ/స్పోర్ట్స్ కోటా విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ : నవంబర్ 14 నుంచి నవంబర్ 16 వరకు
- నమోదిత అభ్యర్థుల జాబితా ప్రదర్శన : నవంబర్ 17
- వెబ్ ఆప్షన్స్ పక్రియ – మొదటివిడత : నవంబర్ 18 నుంచి నవంబర్ 19 వరకు
- వెబ్ ఆప్షన్స్ సవరణ – మొదటివిడత : నవంబర్ 20
- ఎంపికైన అభ్యర్థుల జాబితా కళాశాలల వారీగా సిద్ధం చేసి వెబ్ సైట్ లో ఉంచడం (మొదటి విడత సీట్లు కేటాయింపు): నవంబర్ 22
- సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయడంతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ట్యూషన్ ఫీజు చలాన్ చెల్లింపు: నవంబర్ 23 నుంచి నవంబర్ 26 వరకు
- తరగతులు ప్రారంభం : నవంబర్ 28.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE