ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. పెద్దసంఖ్యలో పోలీస్ నియామకాలకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా 411 ఎస్సై, 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు 6511 పోస్టుల నియామక ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎస్ఎల్పీఆర్బీ) చేపట్టనుంది. ఈ మేరకు ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు తేదీలను, హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీలను మరియు ప్రిలిమినరీ పరీక్ష తేదీలను ఏపీఎస్ఎల్పీఆర్బీ ప్రకటించింది. ఈ పోస్టుల కోసం https://slprb.ap.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడే సూచించిన ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) పోస్టులు (411):
- ఎస్సై సివిల్ (మెన్ అండ్ విమెన్): 315 పోస్టులు
- రిజర్వ్ ఎస్సై ఏపీఎస్పీ (మెన్): 96 పోస్టులు
- దరఖాస్తు ప్రారంభం : డిసెంబర్ 14, 2022
- దరఖాస్తు చివరి తేదీ : జనవరి 18, 2023
- ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్ డౌన్లోడ్: ఫిబ్రవరి 5, 2023 నుండి
- ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ తేదీ: ఫిబ్రవరి 19, 2023 (పేపర్-1 ఉదయం 10 గంటల నుంచి 1గంట వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు).
పోలీస్ కానిస్టేబుల్స్ (6100):
- పోలీస్ కానిస్టేబుల్స్ సివిల్ (మెన్ అండ్ విమెన్): 3580 పోస్టులు
- పోలీస్ కానిస్టేబుల్స్ ఏపీఎస్పీ (మెన్): 2520 పోస్టులు
- దరఖాస్తు ప్రారంభం : నవంబర్ 30, 2022
- దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ 28, 2022
- ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్ డౌన్లోడ్: జనవరి 9, 2023 నుండి
- ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ తేదీ: జనవరి 22, 2023.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE