ప్రముఖ సినీనటుడు టి.చలపతిరావు మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని తెలిపారు. వైవిధ్యంతో కూడిన పలు రకాల పాత్రల్లో వందలాది చిత్రాల్లో నటించిన చలపతిరావు, తెలుగు వెండితెరపై తనదైన ముద్ర వేశారని సీఎం కేసీఆర్ అన్నారు. నటుడిగా, నిర్మాతగా మూడు తరాల నటులతోనూ పనిచేసిన చలపతిరావు మరణం, సినీరంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. అలాగే చలపతిరావు కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE