శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నేటి నుంచి డిసెంబర్ 30 వరకు పూర్తి షెడ్యూల్ ఇదే…

President Droupadi Murmu will Visit Telangana for Winter Sojourn at Rashtrapati Nilayam from December 26 to 30,President Draupadi Murmu, Draupadi Murmu Hyderabad winter vacation, Murmu complete schedule,President schedule December 30,Mango News,Mango News Telugu,President Droupadi Murmu,President Draupadi Murmu Speech,Mango News,Mango News Telugu,India’S President Droupadi Murmu,Droupadi Murmu Is India'S New President,Droupadi Murmu Is 15Th President,Droupadi Murmu Elected As India'S New President,Droupadi Murmu Takes Oath As 15Th President Of India,Droupadi Murmu Becomes India'S 15Th President,Droupadi Murmu Takes Oath As President Of India,India President Droupadi Murmu,Droupadi Murmu New President,President Of India Droupadi Murmu,Presidential Candidate Draupadi Murmu,India President 2022 Draupadi Murmu

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా నేటి నుంచి (డిసెంబర్ 26, సోమవారం) నుండి డిసెంబర్ 30వ తేది వరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడిది చేయనున్నారు. రాష్ట్రంలో జరిపే ఐదు రోజుల పర్యటనలో భాగంగా భద్రాచలం, రామప్ప సహా ఏపీలోని శ్రీశైలం ఆలయాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు.

డిసెంబర్ 26 నుండి 30 వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన షెడ్యూల్:

డిసెంబర్ 26-సోమవారం: సోమవారం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న అనంతరం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంకు వెళ్లనున్నారు. శ్రీశైలం ఆలయాన్ని రాష్ట్రపతి సందర్శిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క ప్రసాద్ పథకం కింద శ్రీశైలం ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకునే ముందు శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్పూర్తి కేంద్రాన్ని కూడా రాష్ట్రపతి సందర్శిస్తారు.

డిసెంబర్ 27-మంగళవారం: హైదరాబాద్‌లోని కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు మరియు అధ్యాపకులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఇదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించి ఆఫీసర్ ట్రైనీస్ ఆఫ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (74వ ఆర్ఆర్ బ్యాచ్)ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌లో మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) వైడ్ ప్లేట్ మిల్ కూడా ప్రారంభించనున్నారు.

డిసెంబర్ 28-బుధవారం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామివారి దేవస్థానంను రాష్ట్రపతి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ పథకం కింద భద్రాచలం ఆలయంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. వనవాసి కళ్యాణ్ పరిషత్-తెలంగాణ నిర్వహించే సమ్మక్క సారలమ్మ జనజాతి పూజారి సమ్మేళనాన్ని కూడా ఆమె ప్రారంభిస్తారు. అలాగే తెలంగాణలోని కొమరంభీమ్ ఆసిఫాబాద్ మరియు మహబూబాబాద్ జిల్లాలలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను వర్చువగా ప్రారంభిస్తారు. ఇదే రోజు వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని రాష్ట్రపతి సందర్శించి, అక్కడ రామప్ప ఆలయంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరియు కామేశ్వరాలయ ఆలయ పునరుద్ధరణకు శంకుస్థాపన చేస్తారు.

డిసెంబర్ 29-గురువారం: నగరంలోని జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (ఫర్ ఉమెన్) విద్యార్థులు మరియు ఫ్యాకల్టీ సభ్యులతో పాటు హైదరాబాద్‌లోని బీఎం మలానీ నర్సింగ్ కాలేజ్ మరియు సుమన్ జూనియర్ కాలేజ్ ఆఫ్ మహిళా దక్షతా సమితి విద్యార్థులు మరియు సిబ్బందితో రాష్ట్రపతి సంభాషిస్తారు. ఇదే రోజు శంషాబాద్‌లోని శ్రీరామనగరంలో ఉన్న సమతా మూర్తి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని రాష్ట్రపతి సందర్శిస్తారు.

డిసెంబరు 30-శనివారం: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో వీరనారీలు మరియు ఇతర ప్రముఖులకు విందు కార్యక్రమం నిర్వహిస్తారు. ఇదే రోజు సాయంత్రం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 5 =