సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని

Kesineni Nani, CM Jagan, Kesineni nani comments, AP Politics, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Chandrababu, AP CM, YS Sharmila, TDP, Mango News Telugu, Mango News
Kesineni Nani, CM Jagan, Kesineni nani comments, AP Politics

విజయవాడ రాజకీయాలు కొద్దిరోజులుగా గరంగరంగా మారిన విషయం తెలిసిందే. కేశినేని బ్రదర్స్ వ్యవహారంతో ఒక్కసారిగా విజయవాడలో రాజకీయాల్లో రసవత్తరంగా మారాయి. ఈసారి కేశినేని చిన్నిని టీడీపీ హైకమాండ్ పక్కకు పెట్టేసింది. ఆయన స్థానంలో నాని సోదరుడు కేశినేని చిన్నివైపు టీడీపీ మొగ్గు చూపింది. దీంతో కేశినేని చిన్ని తన ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే అధికార వైసీపీలో చేరిపోయారు. విజయవాడ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని వార్తలు చూసినప్పుడు జగన్‌పై అనుమానం కలిగిందని వ్యాఖ్యానించారు.

గతంలో ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలను చూసి.. అవి నిజమని నమ్మేవాడినని నాని చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ తప్పుడు వార్తలని వైసీపీలో చేరినాకే అర్థమయిందని చెప్పారు. జగన్ నిబద్ధత ఏమితో తనకు ఇప్పుడు అర్థమయిందని వివరించారు. నిత్యం ఎల్లో మీడియా జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఎక్కడో మారుమూల గుంతలు పడిన రోడ్లను ఫొటోలు తీసి ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని.. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని రోడ్లు ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? అని నాని ప్రశ్నించారు.

ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వంటి మహమ్మారినే వైసీపీ సర్కార్ సమర్థవంతంగా ఎదుర్కుందని చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ ఉద్యోగుల జీతాలు ఆగిపోలేదని.. సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోలేదని వివరించారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు జగన్ వంటి నాయకుడిని చూడలేదని నాని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు బాటకపు వాగ్దానాలకు అలవాటు పడ్డారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రతికూల ప్రచారం చేస్తున్నారని భగ్గుమన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE