కడప లోక్ సభ ఎన్నికల బరిలో వైఎస్ వివేకా భార్య

Kadapa, YS Vivekananda reddy, YS Sowbhagya, YS Sharmila, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, YSR's wife, Hyderabad, Andhra Pradesh, Congress, Mango News Telugu, Mango News
Kadapa, YS Vivekananda reddy, YS Sowbhagya, YS Sharmila

కడప అంటేనే రెడ్ల అడ్డ. దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ ఫ్యామిలీ హవా కొనసాగుతోంది. 1989 నుంచి ఇప్పటి వరకు కూడా కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్సార్ కుటుంబీకులే ఎంపీలుగా ఎన్నికవుతున్నారు. అయితే  త్వరలో ఎన్నికలు జరగనుండడంతో.. కడప లోక్ సభ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకుంటే ఈసారి ఇద్దరు వైఎస్సార్ ఫ్యామిలీకి చెందిన వారే ప్రత్యర్థులుగా పోటీ పడుబోతున్నారు. ఈక్రమంలో కడప రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి.

ప్రస్తుతం కడప సిట్టింగ్ ఎంపీగా వైఎస్ వివేకానంద రెడ్డి కుమారుడు వైఎస్ అవినాశ్ రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే కడప నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 1989 నుంచి వరుసగా నాలుగుసార్లు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడంతో ఆయన సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు. 1999, 2004లో కడప ఎంపీగా వివేకానంద రెడ్డి పోటీ చేసి గెలుపొందారు.

ఆ తర్వాత 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కడప నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున అవినాశ్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా ఆ స్థానం నుంచి అవినాశ్ రెడ్డినే బరిలోకి దింపేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల కడప నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

కానీ ఇప్పుడు వైఎస్సార్ ఫ్యామిలీకి చెందిన కొత్త వ్యక్తి పేరు వినిపిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి భార్య.. సౌభాగ్యమ్మను బరిలోకి దింపాలని వైఎస్ షర్మిల భావిస్తున్నారట. తనకంటే వైఎస్ సౌభాగ్యమ్మ పోటీ చేయడమే కరెక్ట్ అని అనుకుంటున్నారట. అందుకే తాను తప్పుకొని అవినాశ్ రెడ్డికి ప్రత్యర్థికి సౌభాగ్యమ్మను బరిలోకి దించేందుకు వైఎస్ షర్మిల కసరత్తు చేస్తున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =