రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు..దేశవ్యాప్తంగా ఐబొమ్మ పేరు అందరికీ చిరపరిచితమే. కావాల్సిన భాషల్లో, కావాల్సిన సినిమాలను ఈ సైట్ ద్వారా సినీ లవర్స్ తెగ చూస్తున్నారు.దీని వల్ల నిర్మాతలకు భారీ నష్టం కలుగుతున్నా ఐ బొమ్మ మాత్రం రకరకాల లింకులను సైట్లో ఇస్తూ మూవీ అభిమానులను తమ వెబ్ సైట్ నుంచి కదలనీకుండా చేస్తుంది. దీంతో రోజురోజుకు ఐ బొమ్మను ఆశ్రయించేవారి సంఖ్య ఎక్కువ అవుతుంది.
దీనికి మెయిన్ కారణం థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులు సినిమాలు చూసే అవకాశం లేకుండా నిర్మాతలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. సినిమా విడుదలైన మొదటి రెండు వారాలు టికెట్ ధరలను అధిక రేట్లకు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలను బతిమలాడి మరీ తెచ్చుకుంటున్నారు. పెట్టిన పెట్టబడి వచ్చాక.. ముందే కుదురుకున్న ఒప్పందం ప్రకారం వివిధ ఓటీటీలకు అమ్మేసుకుంటున్నారు. దీనికి తోడు ఒక ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చవుతున్నాయంటూ మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.దీంతో ఆ టికెట్ ధరలు చూస్తేనే థియేటర్ వైపు వెళ్లని వారంతా తప్పని తెలిసినా ఐబొమ్మ వంటి థర్డ్ పార్టీ సైట్లను ఆశ్రయిస్తున్నారు.
అయితే ఇటీవల నిర్మాతల డిమాండ్ తో ఐబొమ్మలో పెడుతున్న లింకులను తొలగిస్తున్నారు. అంతేకాదు కొద్ది రోజులుగా ఐబొమ్మ కనిపించకుండా పోయింది. దీంతో మూవీ లవర్స్ షాక్ తిన్నారు. అయితే ప్రస్తుతం ఈ సైట్ తన పేరును మార్చుకుంది. ఐబొమ్మకు బదులు.. bappam.tv అనే పేరుతో వచ్చింది. bappam.tv అని కొట్టగానే ఎప్పటిలాగే ఐబొమ్మ సైట్ ఓపెన్ అవుతుంది. ఐబొమ్మగా పేరు మారకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఆ పేజీ అలాగే ఉంటుంది. కాకపోతే ఐ బొమ్మ అనే పేరుకు బదులు bappam.tv అనే పేరు దర్శనమిస్తుంది.
ఈ సైట్లో హోమ్, అబౌట్, బగ్ అనే ఆప్షన్లు ఇచ్చాడు. ఇక bappam అనే పేరు ఎల్లో కలర్లో ఉంటుంది. డాట్ tv అనేది వైట్ కలర్లో ఉంటుంది. ఎప్పటిలాగే అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు అందుబాటులో ఉంచుతున్నారు. దీనితో పాటు టెక్నాలజీ పరంగా బాగా అభివృద్ధి చేశారు. తెలుగులో తమిళ సినిమాలు కావాలనుకుంటే.. తమిళ్ మూవీస్ అని టైప్ చేయగానే తెలుగు భాషలో అందుబాటులో ఉన్న తమిళ మూవీలన్నీ కనిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF