మందారం మొక్కలు పెంచేవారికి మొగ్గలు విచ్చుకోకుండానే రాలిపోవడం పెద్ద సమస్య. దీనికి పరిష్కారంగా ‘భూలోక స్వర్గం’ ఛానల్ కొన్ని సులభమైన చిట్కాలను సూచించారు.
- నీటి మోతాదు: కుండీలోని పై మట్టి ఆరిన తర్వాతే నీరు పోయాలి. నీరు ఎక్కువైతే ఆకులు పసుపు రంగులోకి మారి మొగ్గలు రాలిపోతాయి.
- ఎండ: మొక్కకు రోజుకు కనీసం 4 నుంచి 6 గంటల ఎండ తగిలేలా చూడాలి.
- సహజ ఎరువులు: పువ్వులు బాగా పూయాలంటే అరటిపండు తొక్కల ఎరువు (పొటాషియం) లేదా ఎప్సమ్ సాల్ట్ కలిపిన నీటిని స్ప్రే చేయాలి.
- తెగుళ్ల నివారణ: తెల్ల పురుగుల నివారణకు వేప నూనెను వాడటం మంచిది.
ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ మందారం మొక్క నిండుగా పూలతో కళకళలాడుతుంది.







































