ఏపీ సీఎం వైఎస్ జగన్ కు వ్యక్తిగత భద్రత పెంపు

AP Breaking News, Ap Cm Ys Jagan Latest News, AP CM YS Jagan Security, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, Special Force Octopus, YCP Latest News
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యక్తిగత భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ పోలీసుల్లోని ప్రత్యేక కమాండో దళం అక్టోపస్‌ను సీఎం వైఎస్ జగన్‌ భద్రతలో భాగం చేస్తూ నిర్ణయం తీసుకుంది. కౌంటర్‌ టెర్రరిజంలో ప్రత్యేకమైన శిక్షణ కలిగిన ఈ బలగాలు సీఎం నివాసం వద్ద డిసెంబర్ 18, బుధవారం నుంచి విధులు చేపట్టాయి. ప్రస్తుతం సీఎం భద్రతలో ఉన్న ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ తోపాటు ఇకనుండి అదనపు భద్రత కోసం ఆక్టోపస్‌ టీమ్‌ కూడా పనిచేస్తుంది. 30 మంది సభ్యులు గల ఆక్టోపస్‌ టీమ్‌ ప్రత్యేక బృందాలుగా విడిపోయి పనిచేస్తుంది. ఒక్కో బృందంలో ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడి నిర్ధేశించిన విధులును చేపడతారు. ఈ ఆక్టోపస్ బృందాలు సీఎం వెంట ఉండటంతోపాటు ఆయన పర్యటనలు, సభలు, సమావేశాల సందర్భంగా షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వర్తిస్తారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here