రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తుకు నేటితో ముగియ‌నున్న‌ గడువు

TS Police Recruitment-2022 Receipt of Applications for 17516 Posts Ends Today, TS Police Recruitment Receipt of Applications for 17516 Posts Ends Today, Receipt of Applications for 17516 Posts Ends Today, 17516 Posts, TS Police Recruitment-2022, 2022 TS Police Recruitment, TS Police Recruitment, TS Police Recruitment News, TS Police Recruitment Latest News, TS Police Recruitment Latest Updates, TS Police Recruitment Live Updates, Today Is The Last Day For TS Police Recruitment-2022, Mango News, Mango News Telugu,

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల‌కు దర‌ఖా‌స్తు గడువు నేటితో ముగియ‌నుంది. రాష్ట్రంలో 16,614 పోలీసు ఉద్యోగాల‌కు (ఎస్ఐ, కానిస్టేబుల్) మరియు ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌ల్లో 677 కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు, అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలకు కలిపి మొత్తం మొత్తం 17,516 పోస్టుల భర్తీకి ఇటీవలే టీఎస్‌ఎల్‌పీఆర్బీ నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ప్రొఫార్మాలో మే 2వ తేదీ నుండి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కాగా, దరఖాస్తు గడువు నేటితో (మే 26, గురువారం రాత్రి 10 గంటలకు) ముగియనుంది.

ముందుగా ఇందులో 17,291 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 20, శుక్రవారం రాత్రి 10 గంటలకు తుది గడువుగా ప్రకటించారు. అయితే పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని 2 సంవత్సరాలు పెంచిన నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మే 26, 2022 వరకు రాత్రి 10 గంటల వరకు పొడిగించబడిందని టీఎస్‌ఎల్‌పీఆర్బీ ప్రకటించింది. ఇక అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ విభాగంలో 225 ఖాళీలుకు కూడా మే 21 నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కాగా, మే 26 రాత్రి 10 గంటలతో గడువు ముగియనుంది. ఇప్పటివరకు ఈ పోస్టులకు 12 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే నేటితో దరఖాస్తు గడువు ముగియనుండడంతో, గురువారం కూడా అభ్యర్థులు నుంచి భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 19 =