విజయవాడలో 144 సెక్షన్‌.. సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ‘చలో తాడేపల్లి’ కార్యక్రమం

AP 144 Section Imposes in Vijayawada Due To Employees Protests Against CPS, AP Vijayawada CP denies permission for Chalo CMO program, Section 144 imposed in Andhra, 144 Section Imposes in Vijayawada, Employees Protests Against CPS, Employees Protests, 144 Section In Vijayawada, Vijayawada 144 Section, 144 Section, 144 Section News, 144 Section Latest News, 144 Section Latest Updates, 144 Section Live Updates, Vijayawada Employees Protests, Mango News, Mango News Telugu,

సీపీఎస్‌ రద్దు కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల (యూటీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు విజయవాడలో 144 సెక్షన్‌ విధించారు. దీంతో పాటు పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను భారీగా మోహరించి ఉద్యోగులు నగరంలోకి వెళ్లకుండా ప్రధాన రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలను అడ్డుకోవడానికి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. కాగా ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి అనుమతి లేదని, ఉద్యోగులెవరూ దీనిలో పాల్గొనటం కోసం విజయవాడకు రావొద్దని విజయవాడ సీపీ హెచ్చరించారు. ఎవరైనా నిబంధలను అతిక్రమిస్తే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని జిల్లాల పరిధిలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల‌ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + ten =