బీహార్ సీఎంగా 8వసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌

Nitish Kumar Takes Oath as Bihar Chief Minister for the 8th Time Tejashwi Yadav as Deputy CM, Tejashwi Yadav Takes Oath as Bihar Deputy CM, Nitish Kumar Takes Oath as Bihar Chief Minister for the 8th Time, RJD's Tejashwi Yadav Sworn In As Bihar Deputy CM, Nitish Kumar was sworn in as the Chief Minister of Bihar for 8th Time, Tejashwi Yadav took oath as the Deputy Chief Minister Of Bihar, Bihar political crisis, Nitish Kumar returned as the Chief Minister of Bihar 8th Time for a record, Bihar Chief Minister Nitish Kumar, Bihar Deputy Chief Minister Tejashwi Yadav, Bihar political crisis News, Bihar political crisis Latest News, Bihar political crisis Latest Updates, Bihar political crisis Live Updates, Mango News, Mango News Telugu,

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు బీహార్ రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఫగు చౌహాన్ నితీష్ కుమార్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. కాగా నితీష్ కుమార్ బీహార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఇది ఎనిమిదోసారి. ఈ కార్యక్రమానికి జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల (మహాగట్‌బంధన్) నాయకులు హాజరయ్యారు. అలాగే కొత్తగా ఏర్పడిన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఆర్జేడీ అధినేత తేజస్వి ప్రసాద్ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ముందుగా బీహార్ సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో బంధాన్ని తెంచుకుంటూ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతునట్టు పేర్కొన్నారు. జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఎన్డీఏ నుంచి వైదొలగడంతో ఏకాభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. బీహార్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్) 125 సీట్లు దక్కించుకుని విజయభేరి మోగించడంతో సీఎంగా నితీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా బీజేపీతో విభేదాల నేపథ్యంలో తాజాగా మహాగట్‌బంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు) తో మళ్ళీ పొత్తు పెట్టుకోవాలని జేడీయూ నిర్ణయించింది. దీంతో ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటూ, మంగళవారం సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ క్రమంలోనే కొత్త కూటమితో బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మరోసారి బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − five =