విజయవాడలో శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం.. పాల్గొని యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం జగన్

CM Jagan Attends Raja Shyamala Yagam Ritual Organised by AP Endowment Department at Vijayawada,CM Jagan Attends Raja Shyamala Yagam Ritual,Raja Shyamala Yagam,Raja Shyamala Yagam Ritual Organised by AP,Mango News,Mango News Telugu,Yagam Ritual Organised by AP Endowment Department,Raja Shyamala Yagam At Vijayawada,CM Jagan Attends Raja Shyamala Yagam At Vijayawada,Raja Shyamala Yagam Latest News And Updates,CM Jagan Latest News And Updates,AP Endowment Department Organise Yagam

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం అయింది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో నేటి నుంచి ఆరురోజుల పాటు అనగా.. మే 12 నుంచి 17 వరకు చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం కొనసాగనుంది. ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించనున్న ఈ మహా యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఉదయం ఇందిరా గాంధీ స్టేడియానికి వచ్చిన ఆయన మహా యజ్ఞానికి సంకల్పం తీసుకోగా.. మహా క్రతువు ప్రారంభం అయింది. ఆ తర్వాత కపిల గోవుకు హారతి ఇచ్చిన సీఎం జగన్.. అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. మొత్తం 108 కుండాలతో, నాలుగు ఆగమనాలతో, 500 మంది ఋత్విక్కులతో ఈ మహా యజ్ఞం జరుగుతోంది. ఇక ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్‌ నజీర్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

కాగా దేవాదాయ శాఖ ఈ యాగం కోసం పోలీస్ శాఖ సహకారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మహా యజ్ఞానికి సంబంధించి డీసీపీ విశాల్‌ గున్నీ స్టేడియం వద్దే ఉండి ఎప్పటికప్పుడు అక్కడి విషయాలను పరిశీలిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు చెందిన సూపరింటెండెంట్ స్థాయి అధికారులు మొదలుకొని కమిషనర్ స్థాయి అధికారుల వరకూ ఈ యజ్ఞానికి హాజరుకానున్నట్లు దేవాదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. యజ్ఞంలో భాగంగా ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ హోమం జరుగనుందని, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి సోత్త్రపారాయణాలు, ప్రవచనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తామని అధికారులు తెలియజేశారు. వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలకు చెందిన దేవతామూర్తుల కళ్యాణ ఉత్సవాలు నిర్వహించనున్నామని, ఆఖరి రోజు ఈనెల 17న పూర్ణాహుతితో మహాయజ్ఞం ముగియనుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − fourteen =