దేశంలో సులభతర వాణిజ్యం విభాగంలో ఏపీకి అగ్రస్థానం

Andhra Pradesh, Andhra Pradesh Got Top Rank, Andhra tops ease of doing business ranking, AP Got Top Rank in Ease of Doing Business rankings, Ease of Doing Business India, Ease of Doing Business rankings, Ease of Doing Business rankings 2019, Ease of Doing Business rankings 2020

ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 4 వ ఎడిషన్ రాష్ట్రాల బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ర్యాకింగ్స్ ను ప్రకటించారు. మార్చి 31, 2019 వరకు రాష్ట్రాలు అమలుచేసిన సంస్కరణలను పరిగణనలోకి తీసుకోని కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ లో ఏపీ మొదటి స్థానంలో నిలువగా, రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్‌ మరియు మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. తొలిమూడు స్థానాలలో నిలిచిన రాష్ట్రాలకు మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. అలాగే ఈ రోజు విడుదల చేసిన ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ రాష్ట్రాలు చేసిన ప్రయత్నాలకు ప్రతిబింబమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్ వ్యాఖ్యానించారు.

మొదటి పది రాష్ట్రాల బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ర్యాకింగ్స్ – 2019:

  • ఆంధ్రప్రదేశ్: ర్యాంక్-1
  • ఉత్తర ప్రదేశ్: ర్యాంక్-2
  • తెలంగాణ: ర్యాంక్-3
  • మధ్యప్రదేశ్: ర్యాంక్-4
  • జార్ఖండ్: ర్యాంక్-5
  • ఛత్తీస్‌ గడ్: ర్యాంక్-6
  • హిమాచల్ ప్రదేశ్: ర్యాంక్-7
  • రాజస్థాన్: ర్యాంక్-8
  • పశ్చిమ బెంగాల్: ర్యాంక్-9
  • గుజరాత్: ర్యాంక్-10

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 2 =