రెండ్రోజుల పాటు కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ సమావేశాలు

Actor Pawan Kalyan, janasena chief, janasena chief pawan kalyan, Janasena Chief Pawan Kalyan Latest News, Janasena Chief Pawan Kalyan To held Meetings with Party Leaders, Janasena Chief Pawan Kalyan To held Meetings with Party Leaders On July 6, Janasena Party, Janasena Party Meeting, Mango News, pawan kalyan, Pawan Kalyan Meeting with Party Leaders, Pawan Kalyan Meetings with Party Leaders, Pawan Kalyan To held Meetings with Party Leaders

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళ, బుధ వారాల్లో కీలక అంశాలపై సమావేశాలు నిర్వహించనున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ” మంగళ, బుధవారాల్లో పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహిస్తారు. కరోనా కారణంగా కోల్పోయిన జనసేన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. మంగళవారం ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. బుధవారం పీఏసీ సమావేశంలో ప్రభుత్వ చర్యల వల్ల సమాజంలో తలెత్తుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులు, భవిష్యత్ కార్యచరణపై చర్చించి రోడ్ మ్యాప్ ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు యువత కూడా ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ యువతతో కూడా ఆయన సమావేశం అవుతారు” అని తెలిపారు.

“కరోనా పరిస్థితుల నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కుటుంబాలకు దూరమయ్యారు. రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు సొంత వారిని కోల్పోయాయి. జనసేన పార్టీ సైతం ఎంతో మంది జనసైనికులను, నాయకులను, సమాజం కోసం సేవ చేసే గొప్ప వ్యక్తులను దూరం చేసుకుంది. విపత్కర పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులు శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించాం. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో కార్యక్రమాలు చేపడితే ఇబ్బందులు తలెత్తుతాయన్న కారణంగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనసేన పార్టీ తరఫున మా వంతుగా అన్ని నియోజకవర్గాల్లో ఆక్సిజన్ సరఫరా వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జనసైనికులు కోవిడ్ వచ్చిన వారికి కూడా దగ్గరగా ఉండి సేవలు చేయడాన్ని పట్ల గర్విస్తున్నాం” అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =