ఈ నెల 17,18,19 తేదీల్లో ఢిల్లీ వేదికగా పలు కార్యక్రమాలు – అమరావతి పరిరక్షణ సమితి నేతలు

AP Amaravati JAC Leaders Announces Several Programs To be Held in Delhi on Dec 17th-19th,Many Programs Will Be Held In Delhi, 17Th To 19Th Of This Month,Amaravati Conservation Committee,Amaravati Conservation Committee Leaders,Mango News,Mango News Telugu,Amaravati Capital,Ycp Government Committed To 3 Capitals For Ap, Legislative Capital Is Amaravati,Sajjala Ramakrishna Reddy,Ap Govt Advisor Sajjala Ramakrishna Reddy,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy , Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి జేఏసీ ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్టంలో ఒకవైపు ఆందోళనలు, మరోవైపు పాదయాత్రలతో వివిధ రకాలుగా జేఏసీ నేతలు, ఆ ప్రాంత రైతులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నిరసనలను దేశ రాజధానికి తీసుకెళ్లడానికి నిశ్చయించుకున్నారు. డిసెంబరు 17,18,19 తేదీల్లో ఢిల్లీ వేదికగా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి, కార్యదర్శి గద్దె తిరుపతిరావులు మీడియాకు తెలియజేశారు. దీనికోసం ఢిల్లీకి అమరావతి నుంచి 1800 మంది రైతులు ప్రత్యేక రైలులో వెళ్లనున్నారని, రాజధానిగా అమరావతిని ప్రకటించాలని ఢిల్లీ వేదికగా తమ డిమాండ్ వినిపిస్తామని వెల్లడించారు. ఈ నెల 17న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని, 18న పలు రాష్ట్రాల ఎంపీలను కలిసి అమరావతికి మద్దతు కోరుతామని, అలాగే 19న రామ్‌లీలా మైదానంలో జరుగనున్న కిసాన్ సంఘ్ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 12 =