ఏపీలో ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు.. అన్ని పరీక్ష కేంద్రాలను ‘నో ఫోన్‌ జోన్స్’ గా ప్రకటించిన అధికారులు

AP Inter Exams Starts Today and All Centers Announced as No Phone Zones, All set for AP Intermediate examinations from today, AP Intermediate examinations from today, AP Inter Exams Starts Today, All Centers Announced as No Phone Zones, No Phone Zones, AP Intermediate examinations, Intermediate examinations, Andhra Pradesh Intermediate public examinations will begin From Today, Intermediate public examinations, Andhra Pradesh Intermediate public examinations, officials declared all the test centers as No Phone Zones, AP Inter Exams, AP Intermediate public examinations News, AP Intermediate public examinations Latest News, AP Intermediate public examinations Latest Updates, AP Intermediate public examinations Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24 వరకు నిర్వహించనున్న పరీక్షలకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు  హాజరుకానున్నారు. పరీక్ష నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనుండగా, విద్యార్థులు కనీసం గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కాగా పరీక్ష కేంద్రాలు రూట్లల్లో రెగ్యులర్‌ సర్వీసులు సమయం ప్రకారం నడపాలని అన్ని జిల్లా అధికారులకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా జరిగిన సంఘటనల దృష్ట్యా ఇంటర్ పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం పరీక్షా కేంద్రాల్లోని అన్ని గదులకు వెలుపల సీసీ కెమెరాలను అమర్చింది. ఈ కెమెరాలు పరీక్ష మార్గాలను రికార్డ్ చేస్తాయి మరియు వాటిని ఇంటర్-బోర్డ్ కార్యాలయానికి అనుసంధానిస్తాయి. ఇవి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా పరీక్షల నిర్వహణను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాయి. జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షిస్తాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే ఆయా జిల్లాల ఎస్పీలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు తెలంగాణాలో కూడా శుక్రవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా 1443 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్ని గ్రూపులకు చెందిన ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9.07 లక్షల మంది హాజరుకానున్నారు. 150 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, 75 మంది ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 12 =