జూలై 22 న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ?

Andhra Pradesh cabinet expanded, Andhra Pradesh cabinet expansion, Andhra Pradesh cabinet meeting, AP Cabinet Expansion, AP Cabinet Latest News, AP Cabinet Likely To be Extended, AP Cabinet Meet, AP CM YS Jagan cabinet expansion, YS Jagan Cabinet Expansion

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో కేబినెట్ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే వైస్సార్సీపీ నుంచి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ క్రమంలో జూలై 22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందిన నాయకులు కావడంతో, కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + five =