కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై దృష్టి పెట్టాలి

Cabinet Secretary Rajiv Gauba, Cabinet Secretary Rajiv Gauba Video Conference, Cabinet Secretary Rajiv Gauba Video Conference with Chief Secretaries, Cabinet Secretary Rajiv GaubaVideo Conference, Somesh Kumar, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Video Conference

వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కోవిడ్-19 నియంత్రణపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా జూలై 4, శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటైన్ మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కు సంబంధించి కఠినంగా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా సామర్థ్యాలను పెంచడం, ట్రేసింగ్, టెస్టింగ్, ఇతర చర్యల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం తదితర అంశాలపై క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా చర్చించారు.

ముఖ్యంగా మరణాల సంఖ్య సాధ్యమైనంత తగ్గించడంపై దృష్టి పెట్టాలని వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆయన తెలిపారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఎన్-95 మాస్క్ ల లభ్యత, క్లినికల్ మేనేజ్ మెంట్, ఇతర మౌళిక సదుపాయాల సమస్యల పై ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా సమీక్షించాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్ర బృందం సందర్శన అనంతరం పరీక్షా సదుపాయాలను పెంచడం, కంటైన్ మెంట్ జోన్లలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డి.జి.పి. మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు రవి గుప్త, వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + seven =