మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడి అరెస్ట్‌పై స్పందించిన ఏపీ సీఐడీ డీఐజీ సునీల్

AP CID DIG Sunil Kumar Responds Over Ex Minister Ayyanna Patrudu and His Son Arrest in Press Meet, Ex Minister Ayyanna Patrudu and His Son Arrest, AP CID DIG Sunil Kumar, AP CID Sunil Naik Conducts Press Conference Over Arrest Of TDP Leader Chintakayala Ayyanapatrudu, TDP Leader Chintakayala Ayyanapatrudu, Chintakayala Ayyanapatrudu, Ayyanapatrudu Arrest, Ex Minister Ayyanna Patrudu, AP CID Sunil Naik Conducts Press Conference, AP CID Sunil Naik Press Conference, AP CID Sunil Naik, former State Minister Chintakayala Ayyanapatrudu, TDP against the CID And YSRCP, Ayyannapatrudu and his sons were Arrested, Ayyanapatrudu Arrest News, Ayyanapatrudu Arrest Latest News And Updates, Ayyanapatrudu Arrest Live Updates, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మరియు ఆయన కుమారుడు రాజేశ్ ల అరెస్ట్‌ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. టీడీపీ నేతలు, శ్రేణులు దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుతో పాటు ఆయన కుమారులు విజయ్, రాజేశ్ లపై తమకు ఫిర్యాదు అందిందని, తమకు అందిన ఫిర్యాదు ప్రకారం నెల రోజుల పాటు విచారణ జరిపి దీనిలో ప్రాథమిక అధరాలు ఉన్నాయని నిర్ధారించుకున్నామని వివరించారు. కాగా తమది కాని 2 సెంట్ల భూమిని అయ్యన్నపాత్రుడు, ఆయన ఇద్దరు కుమారులు చింతకాయల విజయ్, చింతకాయల రాజేశ్ లు ఆక్రమించారని, దీనికోసం వారు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్ఓసీని సృష్టించారని తెలిపారు.

ఇక దీనితో పాటు ఆ ఇంజినీర్ పనిచేస్తున్న కార్యాలయ సీల్ మూడా నకిలీదేనని నాయక్ వెల్లడించారు. అనంతరం దీనిని ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి అధికారి చేత అటెస్టేషన్ కూడా చేయించారని, ఆ అధికారిని అయ్యన్న తన ఇంటికి పిలిపించి బలవంతంగా అటెస్టేషన్ చేయించారని తెలియజేశారు. వారిపై ఐపీసీ 464, 467, 471, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, అరెస్ట్ సందర్భంగా బల ప్రయోగం జరిగిందన్న ఆరోపణలను తోసిపుచ్చిన డీఐజీ చట్టప్రకారమే తాము అయ్యన్న, రాజేశ్ లను అరెస్ట్ చేశామని ప్రకటించారు. ఈరోజు వీరిని కోర్టులో హాజరు పరచనున్నామని, ఇక ఈ సెక్షన్ల ఆధారంగా నిందితులకు 10 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉందని సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − five =