వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు

YS Viveka Assassination Case Telangana High Court Cancels The Bail of Prime Accused Erra Gangireddy,YS Viveka Assassination Case,Telangana High Court Cancels The Bail,Prime Accused Erra Gangireddy,Mango News,Mango News Telugu,Telangana High Court cancels Erra Gangireddy bail,Vivekananda Reddy Murder Case,YS Viveka murder,Telangana HC cancels bail of key accused,YS Viveka Assassination Case Latest News,YS Viveka Assassination Case Live News,YS Viveka Assassination Case Latest Updates,Prime Accused Erra Gangireddy News Today,Prime Accused Erra Gangireddy Live News

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ-1)గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5వ తేదీలోపు లొంగిపోవాలని, లేదంటే గంగిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయవచ్చని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో బుధవారంతో వాదనలు ముగియగా.. నేడు సింగిల్ మెంబర్ బెంచ్ తీర్పును వెలువరించింది. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకు పథకం పన్నింది ఎర్ర గంగిరెడ్డి అని, దానిని అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా సీబీఐ హైకోర్టులో వాదనలు వినిపించింది.

అంతేకాకుండా వివేకా హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేయడంలో గంగిరెడ్డి కీలకపాత్ర పోషించాడని, ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే అతడి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ వాదించింది. అలాగే వివేకా హత్య జరిగిన రోజు వాచ్‌మెన్ రంగన్న, గంగిరెడ్డితో పాటు ఇతర నిందితులను గుర్తించాడని, హత్యానంతరం గంగిరెడ్డి, శివశంకర్‌ రెడ్డి సాక్ష్యాలను చెరిపేశారని తెలిపాడని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు వివేకా కుమార్తె వైఎస్‌ సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది కూడా డిఫాల్ట్ బెయిల్‌ను పరిశీలించి మెరిట్ ఆధారంగా రద్దు చేయవచ్చని వాదనలు వినిపించారు.

అయితే గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేసేందుకు సీబీఐ పలుమార్లు ప్రయత్నించినా విఫలమైందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లను కడప కోర్టు, ఏపీ హైకోర్టు కూడా కొట్టివేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇంకా బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ వివేకా హత్యతో గంగిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని ఆయన హైకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలన్నింటినీ సావధానంగా పరిశీలించిన ధర్మాసనం చివరకు సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకుని గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =