సీఎం జగన్ కీలక నిర్ణయం.. రాజమండ్రిలో 7.5 మెగావాట్ల ‘వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్’కు ఆమోదం

AP CM YS Jagan Holds Review on Municipal and Urban Development Department Today,CM Jagan's key decision, Approval for 7.5 MW Waste to Energy Plant, 7.5 MW Waste to Energy Plant in Rajahmundry,7.5 MW Waste to Energy Plant,Waste to Energy Plant Rajahmundry,Rajahmundry Latest News And Updates,Rajahmundry 7.5 MW Waste to Energy Plant,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రిలో 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మించే ‘వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్’కు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్షలో అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే పట్టణాభివృద్ధి శాఖ రూపొందిస్తున్న ఏపీ కన్సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్ (ఎంఎస్) అనే ప్రత్యేక యాప్ ద్వారా సీఎం జగన్ పర్యవేక్షణ చేయనున్నారు. ఇక తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు..

  • ‘ఎంఎస్’ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4,119 సచివాలయాల పరిధిలో శాఖాపరమైన పనితీరు పర్యవేక్షణ చేయాలి.
  • వార్డు సెక్రటరీలు తమ పరిధిలో 6-7 కి.మేర రోడ్లపై ఉదయం 10-12 గంటల మధ్య నిరంతర పర్యవేక్షణ జరపాలి.
  • అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ దృష్టికి వచ్చిన అంశాలపై యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలి.
  • వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణాన్ని స్పెషల్ డ్రైవ్‌గా చేపట్టాలి.
  • రాజమండ్రిలో 7.5 మెగావాట్ల ‘వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్’ నిర్మించటానికి ఆమోదం.
  • 28 అర్బన్ లోకల్ బాడీస్ ను కవర్ చేస్తూ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here