ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.. అనుమతి లేకుండా అమితాబ్ బచ్చన్ పేరు, ఫోటో, వాయిస్ ఉపయోగించరాదు

Bollywood Legend Amitabh Bachchan's Name Image Voice Can't be Used Without Any Permission Delhi HC Orders,Key Orders Of Delhi High Court,Amitabh Bachchan Name, Amitabh Bachchan Photo,Amitabh Bachchan Voice,Should Not Be Used Without Permission,Mango News,Mango News Telugu,Amitabh Bachchan,Amitabh Bachchan Movies,Amitabh Bachchan Latest Movies,Amitabh Bachchan Movies 2022,Amitabh Bachchan Upcoming Movies 2022,Amitabh Bachchan New Movie,Amitabh Bachchan News And Live Updates

బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అనుమతి లేకుండా అతని పేరు కానీ, ఫోటో కానీ లేదా వాయిస్‌ని కానీ ఉపయోగించరాదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ‘బిగ్ బి’గా ప్రసిద్ధి చెందిన 80 ఏళ్ల అమితాబ్ బచ్చన్.. తన సమ్మతం లేకుండా తన ఇమేజ్ దెబ్బతీసేవిధంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా చూడాలని కోరుతూ పిటిషన్‌ వేశారు. దీనిపై విచారించిన కోర్టు శుక్రవారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఇప్పటికే వినియోగిస్తున్న కంటెంట్‌ను తొలగించాలని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోర్టు ఆదేశించింది. అయాచితంగా తన సెలబ్రిటీ హోదాను ఉపయోగించకుండా కట్టడి చేయాలనీ ఆయన తరపు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే కోర్టుని అభ్యర్ధించారు. ఎవరో ఎక్కడో తయారు చేసిన ప్రోడక్ట్ పైన అమితాబ్ చిత్రాన్ని ముద్రించి అమ్మడం వంటివి ఇందుకు ఉదాహరణలుగా ఆయన ప్రస్తావించారు. ఆయన వాదనతో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు ఇకపై ఎవరూ అమితాబ్ బచ్చన్ అనుమతి లేకుండా ప్రచారాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + two =