కరప గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్

AP CM YS Jagan Launches Grama Sachivalayam In Karapa Village Today,Mango News,AP CM YS Jagan LIVE Launching of Village Secretariat by Hon'ble CM of AP at Karapa Village,agan Launching Village Secretariat At Karapa East Godavari,Jagan Govt to Launch its Ambitious Rural Project Across Andhra on October 2,Grama Sachivalayam And Ward System Launched Grandly In Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 2, బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సచివాలయ వ్యవస్థలో భాగంగా మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని కాకినాడ నియోజక వర్గపరిధిలోని కరప గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్ లో కరప గ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు, అనంతరం గ్రామ సచివాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణాలలో 3,786 వార్డు సచివాలయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకిత భావంతో సేవలు అందించాలని ఉద్యోగులకు సూచించారు. అక్కడ స్థానిక హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పధకాల ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం ప్రజనుద్దేశించి బహిరంగ సమావేశంలో మాట్లాడతారు . తిరిగి 1.25 గంటలకు సభా స్ధలి నుంచి కారులో బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుని, 1.40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లికు చేరుకుంటారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here