జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటన, తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక

2021 National Teachers Awards, List announced for the National Teacher award 2021, Mango News, MHRD National Awards to Teachers 2021, National Award to Teachers 2021 announced, National Teachers Awards, National Teachers Awards 2021, National Teachers Awards 2021 List, National Teachers Awards list, Union Ministry of Education, Union Ministry of Education Announced National Teachers Awards, Union Ministry of Education Announced National Teachers Awards 2021

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం నాడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2021 కు ఎంపికైన ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 44 మంది ఉపాధ్యాయులను ఈ పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎంపికైన ఉపాధ్యాయులలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మహారాష్ట్ర, తమిళనాడు మరియు సీబీఎస్ఈ నుండి ఇద్దరు చొప్పున ఉన్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన వారిలో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సావర్‌ఖేడ్‌ ఎంపీపీఎస్‌ యాక్టింగ్‌ ప్రధానోపాధ్యాయుడు కాడెర్లా రంగయ్య, సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్ హెడ్ ఉపాధ్యాయుడు రామస్వామి ఉన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన వారిలో విశాఖపట్నం ఎస్ రాయవరం లింగరాజుపాలెం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు కొణతాల ఫణి భూషణ్‌ శ్రీధర్‌, చిత్తూరు ఐరాల ఎం పాయిపల్లి జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎస్ మునిరెడ్డి ఉన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపికైన 44 మంది ఉపాధ్యాయులను సన్మానించి, అవార్డులు అందజేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =