నేడు పార్లమెంట్‌లో విద్యుత్ చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం.. వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల ధర్నా

TEE JAC Calls Employees For Boycotting Duties To Protest Against Electricity Bill Amendment by Centre Today, TEEJAC has asked the employees to boycott work on Monday, TEE JAC Calls Employees For Boycotting Duties, Protest Against Electricity Bill Amendment by Centre Today, Protest Against Electricity Bill Amendment, Electricity Bill Amendment Protest, Electricity Bill Amendment, Employees For Boycotting Duties, Boycotting Duties, Electricity Amendment Bill, Electricity Amendment Bill 2022, 2022 Electricity Amendment Bill, TEEJAC, Electricity Bill Amendment Protest News, Electricity Bill Amendment Protest Latest News, Electricity Bill Amendment Protest Latest Updates, Electricity Bill Amendment Protest Live Updates, Mango News, Mango News Telugu,

నేడు కేంద్రం పార్లమెంట్‌లో విద్యుత్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో.. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజినీరింగ్ జేఏసీ దేశవ్యాప్త విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు నిరసనగా సోమవారం విధులు బహిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) కూడా ఉద్యోగులను కోరింది. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 2.7 మిలియన్ల విద్యుత్ రంగ ఉద్యోగులు మరియు ఇంజనీర్లు సోమవారం విద్యుత్ (సవరణ) బిల్లుకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఉద్యోగులు తప్పనిసరిగా నల్లబ్యాడ్జీలు ధరించి కార్పొరేట్‌, సర్కిల్‌ కార్యాలయాలు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, డివిజన్‌ ​​కార్యాలయాల్లో విధులు బహిష్కరించి తమ నిరసనను తెలియజేయాలని జేఏసీ చైర్మన్‌ కే ప్రకాశ్‌ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు హాజరయ్యే వారికి మరియు సబ్‌స్టేషన్‌లలో పోస్ట్ చేయబడిన ఇతరులకు నిరసనలో పాల్గొనడం నుండి మినహాయింపు ఉందని, వారు యథావిధిగా తమ విధులను కొనసాగించవచ్చని ప్రకాష్ చెప్పారు. దీంతో టీ ఉద్యోగులు నలుపు రంగు వస్త్రాలు ధరించి మహా ధర్నాలో పాల్గొని తమ నిరసన తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగొచ్చని అలాగే పునరుద్దరణకు కూడా మరింత సమయం పట్టొచ్చని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ సోమవారం రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది.

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలోని ఉద్యోగులు, యూనియన్లు బిల్లు రూపకల్పన ప్రక్రియలో తమను కూడా భాగస్వాములు చేయాలని కోరుతూ విద్యుత్ మంత్రిత్వ శాఖను సంప్రదించాయని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించలేదని తెలిపారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం నేడు దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విధులను బహిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఈ బిల్లు ద్వారా వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వ విద్యుత్ రంగం ధ్వంసం అవుతుందని.. అందుకే తక్షణమే ఈ విద్యుత్‌ చట్టసవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 10 =